యుద్దం ..--డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,-- హనంకొండ .9866252002-8886991785.

యుద్దం ప్రకటిస్తున్నా ,
ఎవరిమీదో కాదు ...
ఎక్కడో కాదు ....ఇక్కడే ...
ఇప్పుడే ...
నామీద నేనే ....
యుద్దం ప్రకటిస్తున్నా ..!


ఈరోజుది ..ఇప్పటిది ,
రేపుకు వాయిదావేసే 
పనికి రాని 
ప్రయోజనంలేని 
అనవసర ఆలోచనపై 
యుద్దం ప్రకటిస్తున్నా !


నేడు చదవాల్సిన 
అమూల్యమైన పుస్తకాన్ని 
తరువాత చదువుదాం ..
అన్న ..మూఢ తత్వంపై 
నా ..యుద్దం ప్రకటిస్తున్న !


నిత్యం ...నడక 
అవసరం ఉన్నా ..
తొంబై కారణాలు చూపించి ,
కాలుకద పని ,
నా కంపు కథనంపై ,
యుద్దమే ప్రకటిస్తున్నా !


బద్ధకబ్రహ్మ 
బిరుదాంకితుడనైన నేను ,
బద్దకాన్ని పారద్రోలాలని ,
కలలుకంటూనే ....
బద్ధకించేస్తున్నా ...
అందుకే ___
నాపై ..నేనే ...
యుద్దం ప్రకటిస్తున్నా !
బద్దకంతో ....
యుద్దానికి ,
సన్నద్దమవుతున్నా ..!!


 


కామెంట్‌లు