ఆరోగ్య భాషణం ..!!------బాల కవిత --డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ -వరంగల్ ..-9866252002-8886991785.

పిల్లలు కోరే 
చిరుతిండ్లు ,
అనా రోగ్యానికి ,
చిరునామా లూ ..
పెద్దలకేమో ....
పెద్ద సవాలు ...!


బర్గర్లు -ఐస్క్రీంలు ,
కేకులూ -కూల్ డ్రింకులు ,
దూరం ..దూరం ...
పిల్లలకెప్పుడూ ....
దూరం ..దూరం ...!


అమ్మలు -బామ్మలు 
ఇంట్లోచేసే ..
పిండివంటలు 
ఆరోగ్యానికి ...
అమృత  గుళికలు ,
రుచిలో 
నోరూరించే .....
కమ్మని దినుసులు !


కాలంతో ----
కలసినడుస్తూ 
ప్రకృతి అందించే 
ప్రతిపండు ...ప్రతిగింజ ,
ప్రతిదుంప ..ప్రతివేరు ,
రుచిచూడాలి .!


ఋతువును బట్టి 
దొరికే ఫలాలు ....
మామిడి పండ్లు ,
బత్తాయి పండ్లు ,
పనస పండ్లు ,
అరటిపండ్లు ,
ఆపిలుపండ్లు ,


జామపండ్లు ,
నేరేడు పండ్లు ,
ఈతపండ్లు 
సపోటాపండ్లు ,
సీతాఫలాలు -
రేగుపండ్లు ....
ద్రాక్ష పండ్లు ,
ఇలా ఒకటేమిటి ,


ప్రతిపండూ 
రుచికరమే  .....
ప్రతిపండూ ......
ఆ రోగ్య కరమే ..
పండ్లన్నీ బలవర్ధకమే !


అందుకే ....
చిరుతిండ్లకు పిల్లలు ,
గుడ్ ..భై ..చెప్పాలి !
ఆ రోగ్యకరమైన 
ఫలాలకే ....
ప్రాదాన్యత నివ్వాలి ...!!



కామెంట్‌లు