మధుర ప్రేమ ...:--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ . ఫోటో....ఆన్షి.నల్లి

ఉదయం లేస్తానా 
జుట్టు చెదిరి పొయి 
ఉంటుంది ......!


తాత కళ్లబడ్డానా ,
తల దువ్వించుకో 
పండూ ...అంటారూ !


అమ్మకు కనిపించానా 
బ్రష్ చేసుకో బేబీ ....
అంటుంది ...!


డాడీకి ...
ఎదురుపడ్డానా ...
ఎత్తుకుని --
ముద్దాడతారు !


వంట గదిలో 
చెమటలు కక్కుతున్న 
అమ్మమ్మను ..
చాకోలెట్
 అడుగుతానా ,


ఇప్పుడు -ఇడ్లీ 
తినాలికదా నాన్నా 
అంటుంది ముద్దుగ !


మా ..వాళ్లందరికి 
నేనంటే --
ఎంత ప్రేమో కదా ..!!



కామెంట్‌లు