హైదరబాద్ ముచ్చట(నా ..వృత్తి విద్య )--డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,-- హనంకొండ.41975..బ్యాచ్ ..బి.డి.ఎస్.9866252002--8886991785

బి.డి.ఎస్ ,లో ...అడ్మిషన్ దొరకడం ,నా అదృష్టం,
అంతే కాక నా ..జీవిత చరిత్రకు అదొక మలుపు,
మైలు రాయి కూడా !
అసలు ,బి.డి.ఎస్ ..అనే కోర్సు ఒకటి ఉందని ,
ఇంటర్ పాస్ అయ్యేవరకూ నాకు తెలియదు .నా 
చిన్నన్నయ్య  ,డా.కె .మధుసూదన్ (ఆకాశవాణి ..
విశాఖ పట్నం )అప్పటికి నిరుద్యోగి.నాకు ఈ కొర్సు 
కు ,సంభందించిన ..సమాచారం ,అప్లికేషన్ తెచ్చి 
నా ..చేతిలో పెట్టి అప్లై చేయమన్నాడు .(అప్పటికి 
ఎంట్రన్సు పరీక్షలు లేవు.కేవలం మార్కులను బట్టి 
సీట్ల కేటాయింపు జరిగేది.)
అలా ...బి.డి.ఎస్ ..కు,సెలెక్ట్ అయి ...చేరి పోయాను. కొన్ని క్లాసులు అఫ్జల్గంజ్ లో ఉన్న ..
ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న 'డెంటల్ వింగ్ '
లొనూ,కొన్ని ..ఉస్మానియా మెడికల్ కాలేజి లోనూ 
జరిగేవి.అందు చేత ..మెడికల్ కాలేజి మెస్ లో ..
భోజనం చేస్తూ ...గౌలి గూడ లో ,గది అద్దెకి తీసుకుని ,ఉండేవాళ్ళం.
ఆ ..రూం లో ,నాతో పాటు,డా.తోట ప్రసాద్ ,
డా.కె .వి.బి.ఆనంద్,డా .హరిప్రసాద్ ..తో పాటు 
మరి కొంతమంది ఉండేవారు .వాళ్ళ పేర్లు గుర్తు 
లేవు .
మెడికల్ కాలేజీ మెస్ లో ..జట్లు ..జట్లు ..గా ,వెళ్ళి 
భోజనం చేసిరావడం గొప్ప అనుభవం ..గురుతు 
పెట్టుకోదగ్గ సన్నివేశాలు అవి.
నెలకొకసారి ఇచ్చే 'మంత్ లీ ఫీస్ట్ ' మరచి పోలేని 
మధురానుభూతి .మెస్ ..సాధారణంగా ,హాస్టల్ ..
విద్యార్థులే నిర్వహించేవారు.మంత్ లీ ఫీస్ట్ ను,
ప్రతి వాళ్లు ..ఏదో ఒక ప్రత్యేకతో నిర్వహించేవారు .
       ఇది సాదారణంగా ఆదివారం ఉండేది.ప్రతి 
రోజులా కాకుండగా బిన్నంగా ఉండేది.చాల ...
ఆలస్యంగా తలుపులు తీసేవారు.లోపల డైనింగ్ 
హాల్ సుందరంగా అలంకరించి ...అగరొత్తులు 
సువాసనల తోను,చికెన్ వాసనల ఘుమ ..ఘుమల 
తోను ..నోరూరుతూ ...ఆకలి మండిపోతుండేది.
ఒకోసారి నాలాంటి వాడికి నీరసం ముంచుకొచ్చేది.
   తలుపులు తెరవడం తరువాయి ..అంతా తోసుకుని వెళ్లి కుర్చీలు ఆక్రమించుకునేవాళ్ళం .
సత్తార్ ...అనుకుంటా ..చెమటలు కక్కుకుంటూ 
చాల స్పీడ్ గా ప్లేట్స్ అందించేవాడు.ఆ ..రోజు ..
ఫుల్ చికెన్,వడ్డించేవారు.నేను మొత్తం తిన లేక 
పోయేవాడిని.పక్కన మంచి ఈటర్ ని ,కూర్చో ..
బెట్టుకొనే వాడిని .తరువాత ఫ్రూట్ ..సలాడ్ ,
పాన్ ఉండేవి.బరువైన పొట్టను ఈడ్చుకుంటూ 
వెళ్లి ..హాయిగా పడుకునేవాళ్ళం .మళ్లీ వచ్చే నెల 
ఎప్పుడా ..అని,ఎదురు చూసేవాళ్ళం.బి.డి.ఎస్ 
చివరి కాలంలో ..ఉస్మానియా మెడికల్ కాలేజి ..
మెయిన్ హాస్టల్ కు ...మితృడు డా.హనుమాన్ ..
ప్రసాద్ సింగ్ కు గెస్ట్ గా ..వెళ్ళిపోయాను .అదే 
రూం మెట్ గా ,డా.మనోహర్ (ప్రస్తుత నిమ్స్ ..
డైరెక్టర్ ) ఉండేవారు .
అవి ..మరచి పొలేని మధుర ఘట్టాలే ..!!


కామెంట్‌లు