ఉనికి ....డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ ,వరంగల్ .-9866252002-8886991785.

చెట్టూ ..చెట్టూ ..
ఏమి చెట్టూ ...
వేసవి దాహంతో 
తలకు వాడే నూనెతో
గుర్తొచ్చే చెట్టూ ....
అదేగా కొబ్బరి చెట్టు !


చెట్టూ ..చెట్టూ ...
ఏమి చెట్టూ ...?
'కల్లు'నుండి --
'తే గలు 'వరకూ ,
వామనుడి 
'గొడుగు'నుండి -
చల్లని 'ముంజెలు '
వరకూ గుర్తొచ్చే చెట్టు ,
అదే గా 'తాడి చెట్టు '!


చెట్టూ ..చెట్టూ ...
ఏమిచెట్టూ ....?
ఆకు --కాయలు 
కూరలుగా గుర్తొచ్చే 
అందరూ ---
తలచుకునే చెట్టు ,
అదేకదా .' మునగ' చెట్టు !


చెట్టూ ..చెట్టూ ...
ఏమి చెట్టూ ..
పండుకు పండు ,
పండునుండి ...
పసందైన రసం ,
రసంనుండి 'తాండ్ర '
గుర్తొచ్చే చెట్టూ ....
అదేగా ' మామిడి 'చెట్టు !


చెట్టూ ..చెట్టూ ...
ఏమిచెట్టూ ....?
చెట్టుమీద పండి 
సువాసనలు -
వెదజల్లే ,
పసందైన పండు 
పండులో తియ్యని 
తొనలు అందించే చెట్టు 
అదే కదా 'పనస ' చెట్టు !


ఇలా ఎన్నో ..ఎన్నెన్నో  చెట్లు ,
ప్రకృతిని పరవశింపజేసే చెట్లు ,
మనిషిని ఆరోగ్యంగా ఉంచే చెట్లు ,
మనిషిని ఆహ్లాద పరిచే చెట్లు ,
మనిషి నిర్లక్ష్యానికి 
మాయమైపోతున్న చెట్లు ...!!



కామెంట్‌లు