సుప్రభాత కవిత : - బృంద
దిగులు పడ్డ దిక్కులను వెలుగులతో నింపేస్తూ ఎదురుచూచు కన్నులకు ఎదురొచ్చే వేలుపులా.... ఎరుపు నిండిన తూరుపున కరువు తీరే కానుకేదో పొదివి పట్టుకు వస్తున్న కాంతి కలశపు మెరుపులా.. మురిసిపోతూ మేఘమాలలు నింగిలో రంగుల తోరణాలై నిలిచి కదిలి వచ్చు కశ్యపాత్మజుని కనులలోనే నింపుకుంటూ.. నిన్నలలోని కొదవలు నేటికి …