అమ్మా ..అంటే -
పలకదు ' మమ్మీ ',
మమ్మీ ...అంటే -
అనందంగా ,ఆ ...
అంటుంది ..' అమ్మ '!
నాన్నా ..అంటే -
" నన్నా ..!" అన్నట్టు
చూస్తారు ..'డాడీ ',
డాడీ ..అని పిలిస్తే ,
సంతోషంగా --
"చెప్పునాన్నా "
అంటారు ..'నాన్న '!
అయోమయంలో నేను ,
తల్లిభాషకు దూరమయి ,
పరభాషకు దగ్గరవుతున్నా !
మాతృభాష పరిమళాన్ని ,
మరచిపోతానన్న-
బాధ లో ఉన్నా ..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి