అమ్మొ..చలి పులి : --డా.కె .ఎల్ .వి.ప్రసాద్ హనంకొండ .

చలి మొదలైంది 
శీతాకాలానికి 
మొదటి లక్షణం 


అందుకే ...
 స్వె ట్ట రుకు
సలాం ....!


చలి పులి 
భయానికి ...
నిద్రా దేవి 
జోకొడుతున్నది 
బద్దకానికి ..
ముద్దు చేస్తున్నది !


పెదవులు ....
ఎండిపోవడం 
పగిలిపోవడం ,


వళ్ళంతా ---
పొడిబారిపోవడం 
మంటలు -దురద 
పలకరిస్తాయ్ ..


అందుకే --
కొబ్బరి నూనెకు ,
బోడీలోషన్ కు 
వందనం ....!


ఈ చలికాలంలో 
ఐస్క్రీంలకు ...
అతి శీతల -
పదార్ధాలకు ,


జలుబు -దగ్గుకూ,
దూరం ..దూరం !
ఆటలు -వ్యాయామం ,
మేలు ..మేలు ...!!
------------------------------
 ఫోటో లో....బేబీ..ఆన్షి.నల్లి.


కామెంట్‌లు