స్వాగతం ...: --డా.కె.ఎల్.వి.ప్రసాద్,హనంకొండ

వచ్చేస్తుంది 
వేసవికాలం 
వేగంగా ....
బాహువేగంగా !
శీతాకాలాన్ని ...
తరిమి ..తరిమి 
శరవేగంగా ...
వచ్చేస్తుంది ,
ఎండాకాలం ...!
రగ్గులు  -రజాయిలు 
స్వేట్టర్లు -మఫ్లర్లు ...
దుప్పట్లు -శాలువాలు 
బీరువాలోకి .....
పంకాలూ -కూలర్లు 
ఏ .సి.లు -
విసనకర్రలు ....
పనిలోకి వచ్చేస్తాయ్ ,
చెమటలు -చిరాకు 
పడే మనుష్యులకు 
ఎంతో సేదదీరుస్తాయ్ !
పండ్లలో మహారాజు 
మామిడి పండ్లు 
మండే ఎండల్లోనే లభ్యం !


రసాలూ -బంగిన పల్లి 
నాకెంతో ఇష్టం ,!
ఆ ..రోజుకోసం ..
ఎదురుచూడ్డం ...
నాకు మరీ ..మరీ ..ఇష్టం !!
------------------------------------
.ఫొటో లో: మామిడి పళ్లతో...
                  ఆన్షి.నల్లి.


కామెంట్‌లు