సవాల్ ..: -- --డా .కె .ఎల్.వి.ప్రసాద్ --హనంకొండ .

నవంబరు నెల 
వచ్చేసింది ...!


వస్తుంది మరి 
తప్పదుగా ...!


కాని ...
వస్తూ ..వస్తూ ..
చలినీ -చల్లగాలిని 
తోడుతెచ్చుకుంది !


ఉదయం కాసేపు ..
సాయంత్రం మొదలై ,
మళ్లీ ...
ఉదయం వరకూ 
శీతాకాలాన్ని 
గుర్తు చేస్తుంది !


అయినా ..ఇప్పుడు 
కాలాల లక్షణాలు 
మారిపొయాయి ,!


శీతాకాలంలో 
వేసవి రావొచ్చు ,!


ఎండా కాలంలో 
వర్షాలూ ..పడొచ్చు !


పట్టాలు తప్పిన బండి 
మనిషి బ్రతుకిప్పుడు !


ఋతువులు 
సవాలు విసిరి 
కబడ్ దార్ ...
అంటున్నాయ్ .....!


ప్రకృతితో --
ఆటలాడొద్దని ...
హెచ్చరిస్తున్నాయ్ ...!!


           


కామెంట్‌లు