కొత్త అడుగులు ..:--డా.కె.ఎల్ .వి.ప్రసాద్ ,-హనంకొండ.వరంగల్.

ప్లస్ టు ...
పూర్తి చేసుకుని ,


వృత్తి విద్యకోసం ,
అహోరాత్రాలు 
కష్టించి ,


అన్నపానీయాలకు
సయితం.....
పరిమితమై ,


వైద్య రంగంలోనొ ,
ఇంజనీరింగ్ లోనో ,
సీటు సంపాదించి,


తామే కాక ...
కన్న తల్లిదండ్రులు 
కించిత్ 
గర్వానికి కూడా  ,
గురి అవుతుంటారు !


ఆనందానికి,
అవధులు 
లేకుండా పోతాయ్ .!


కొత్త ప్రాంతం ,
కొత్త విద్యార్థులు ,
కొత్తవాతావరణం ,
కనిపించే ,
కళాశాలల్లో ,
పిల్లలు కాస్త ,
బెరుగ్గానే 
తిరుగుతుంటారు !


దీన్ని ...
ఆసరా చేసుకుని ,
సీనియర్లుగా 
చెప్పబడే .....
మూర్ఖ జనావళి 
'రేగింగ్ 'పేరుతొ ,
వెర్రి చేష్టలు చెస్తూ 
వెకిలి చూపులు చూస్తూ 
దైర్యం చెప్పాల్సింది పోయి 
అతి భయంకర 
సన్నివేశాలు 
సృష్టింతుంటే ....
పారిపోయే వాళ్లు 
కొందరైతే  ,
ప్రాణం పోగొట్టుకునే వాళ్లు ,
మరికొందరు !!


సీనియర్ 
విద్యార్థులారా ...
ఇది ఎంతవరకు 
న్యాయం ?
రేగింగ్ పేరుతొ ,
వికృత చేష్టలు మానండి !


చదువు సంధ్యల్లో 
చేయూతనిచ్చి ,
జూనియర్లను 
మీ తోటి స్నేహితులుగా 
ఆనందంగా 
ఆహ్వానించండి !


రేగింగ్ ..అంటే ,
పరిచయ వేదిక గానీ 
పారిపోడానికి ,
ప్రాణం 
పోగొట్టుకోడానికీ 
వేదికలు కారాదు !!


 


కామెంట్‌లు