తేడా ...డా.కె.ఎల్.వి.ప్రసాద్,హనంకొండ,వరంగల్.9866252002--8886991785

ఐనవాళ్ల క్రీడలు 
అందమైన మైదానాల్లో ,
ఆకర్షణీయ దుస్తుల్లో ,
విలువయిన బూట్లతో ,
అందరినీ ఆకర్షించేలా ,
కొంచెం ఆట .....
కొంచెం నటన .....
కలగలిపి .....
ఫోటోకోసం ...
ఫోజిచ్చినట్టు ....
ప్రచారం అవుతుంది ....


అవన్నీ సమకూరితేనే 
క్రీడాస్థలం అతనికి /ఆమెకు ,
అసలయిన క్రీడా మైదానం 
అవుతుంది ...!


సామాన్యుడి కి 
కనిపించే ప్రతిస్థలమూ ,
క్రీడా మైదానమే ...
ప్రతివస్తువూ ....
ఆటవస్తువే .....!


అవసరానికి అనువుగా 
మలచుకుని .....
పేరుతెలియని క్రీడలెన్నో 
ప్రతిభావంతంగా ఆడే 
ఇతడూ క్రీడాకారుడే ..!
ప్రచారంతో పనిలేని ,
అసలైన ఆటగాడే ....!!


కామెంట్‌లు