కళా....సామ్రాట్...: --డా.కె .ఎల్.వి.ప్రసాద్ -హనంకొండ .

అక్కడ 
వినిపించే గొంతు ,
వింత వింత విన్యాసాలు 
చేస్తుంటుంది !


వేమూరి గగ్గయ్య ,
క్షణాల్లో ...
కొంగర జగ్గయ్య 
అయిపోతుంది!


అప్పుడే ...
నెహ్రు ఆమాత్యుడి 
స్వరాన్ని వినిపించిన 
కమనీయ గొంతు ,
మనల్ని 
మాయాలోకంలో 
ముంచి,
జాన్ .ఎఫ్ .కెనడీ 
స్వరం -
ఆశ్చర్యంలో ,
ముంచెత్తుతుంది!


ఈతరం ఎరుగని 
గుర్రం జాషువా గొంతు,
అప్పటికప్పుడు ,
విశ్వనాధ అవతారం 
ఎత్తుతుంది !


కళ్ళు మూసుకుని 
వింటే,
మనముందు 
టెన్ కామండ్మెంట్స్ ,
మెకన్నాస్ గోల్డ్ 
బెన్హర్ ,సంక్షిప్త శబ్ద చిత్రాలు,
ప్రత్యక్షమవుతాయి !



ఇంతకీ -
ప్రపంచ దేశాల్లో ,
ఓరుగల్లు -
ఘన కీర్తిని చాటిన ,
ఆ గొంతు ఎవరిది ?


ఇంకెవరిది,
ధ్వన్యనుకరణ సామ్రాట్ 
పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్ ది !


భువి నుండి దివికేగిన 
బహుముఖ -
స్వర కళానిధి ది ,
మన ఓరగల్లు ముద్దు బిడ్డ ,
మిమిక్రీ వేణు మాధవ్ ది !!



కామెంట్‌లు