మనమంతా ......ఒక్కటే ..---డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ .--ఫోటో : ఆన్షి.నల్లి.

అమ్మ ....అంటే 
తెలుఁగు ....!


మమ్మీ ...అంటే 
ఆంగ్లం ....!


మా ...అంటే 
హిందీ ....!


భాష ఏదైతేనేమి ?
భావం ఒక్కటే !


అనుబంధం 
ఒక్కటే ....!


మాతృత్వం తో ,
ముడిపడిఉన్న 
ప్రేమ ఒక్కటే !


ఎవరిమాతృభాష 
వారికి తీపి ....
అదంతే ....!


అందుకే అందరం 
ఒకటిగానే --
కలిసి ఉండాలంతే !!



కామెంట్‌లు