కాల గమనం ....డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్.

మర్పు 
మనిషి ప్రగతి కి 
తొలిమెట్టు ...!



ఇసుకలో 
అక్షారాలు 
దిద్దిన రోజులు 
గత చరిత్రగా 
గుర్తున్నాయి !


వాళ్లూ ...
చదూకున్నారు 
ప్రయాజకులయ్యారు ,
పెద్ద ..పెద్ద ..
స్థానాలను 
అధిరోహించారు ,
జాతి గర్వించదగ్గ 
ఆణిముత్యాలయ్యారు !


పలకా _బలపం 
మాద్యమంగా ....
అక్షరాలు నేర్చుకున్న 
మహానీయులున్నారు ,


అధిక సంఖ్యాకులైన 
పిల్లల చేతి లో...
పలక నిత్యావసరం 
అయింది ....


అది అంచెలంచెలుగా 
కనుమరుగు కాడానికి ,
చాలాకాలమే పట్టింది!


ప్రస్తుత ...
ఆధునిక జీవితంలో
పలకను ..
నోటు పుస్తకం 
స్థాన భ్రంశం చేసింది ,


పెన్సిలు -రబ్బరూ ..
తోడయ్యాయి ....
నోటుపుస్తకం 
స్థిరపడింది ...


పెన్సిలును క్రమంగా 
బాల్పాయింట్ పెన్ 
పక్కకు తోసేస్తోంది !


కాలగమనంలో 
మార్పులెన్నో రావచ్చు ,
మాధ్యమాలు --
మారనూ వచ్చు ....


విజ్ఞా న సముపార్జనలో ,
అంకితభావం ---కృషి ,
క్రమశిక్షణ ఉంటే ,
మాధ్యమాల్లో 
ఎన్ని మార్పులు వచ్చినా ,
ప్రగతి బాటలో 
మనిషి ముందుకు 
సాగిపొతూనే ఉంటాడు !!



కామెంట్‌లు