అత్యాశ ...--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్ .

ఎదురు చూడొద్దు 
దానికొసం ....,
ఆశపడొద్దు -
దాని రాకకోసం !


అది ...
అంత సులభంగా ,
చిక్కేది కాదు ...,
అప్పుడేఅది ...,
అసలు నీవంక 
చూడబోదు ...!


పెద్దవాళ్ల 
పరామర్శ అయ్యాకే ,
గుర్తుంటే ...
నీవంక చూస్తుంది ,
అదికూడా -
నీ ..జేబు .....
దుడ్డుతో --
నిండివుంటేనే సుమా !


అందుకే ...
దానికోసం ...
ఎదురుచూడకు ..!


నీజాగ్రత్తలో -
నువ్వు ఉండు ,
ఆ ..వాక్సిన్ కోసం ,
పగటికలలు --
కనబోకు .......!!



కామెంట్‌లు