అటునుండి ...ఇటు ..: - --కె .ఎల్వీ

పసితనంలో.
పండుగలంటే ,
ఉదయం తలస్నానం,


వింత సువాసనలు ..
వెదజల్లే _
కొత్తబట్టలూ ...


ఆబట్టలు కుట్టే ,
దర్జీ చుట్టు ,
ప్రదక్షిణలు ,


అమ్మ ప్రత్యేకంగా వండే ,
ప   ర   మా   న్నం ,
అనుకున్న ...
తెలిసీ తెలియని రోజులు !


పేదరికం ఒక పక్క,
కమ్యూనిజం దానికి అక్కయై ,
ఇంట్లో ..నాస్తికత్వం ,
మొక్కై మొలిచిన నేపథ్యం ,


దేవుళ్ళకి _పండగలకి ,
సంబంధం తెలియని,
అమాయకపు రోజులు ,


అటు ...నాస్తికత్వం ,
ఇటు ...అస్తికత్వం ...
ఏదీ సరిగా అర్థం తెలియని 
గందరగోళం రోజులు ,


ఏమార్గమూ ...
అర్థవంతంగా ఎంచుకోలేని ,
తికమకరోజులు !


దేవుడనేమాట 
వినిపించని ..కనిపించని,
ఇంట్లోనించి వచ్చినవాడిని ,


క్రైస్తవత్వం...
కనీస సంగతులు
తెలీకుండానే ..
ఆ ..కుటుంబంనుంచి ,
సహచరిని ఎన్నుకున్న ,
సాహసికుడిని !


_క్షమా 
అనురాగం _ఆప్యాయత ,
స్నేహం _సహృదయత ,
కలిసున్న మా హృదయాలకు 
మతాలతో పనియేమి ?
ప్రతి రోజూ ...
పండగేకదా ....!!
     


కామెంట్‌లు