ఏది ...ముఖ్యం ..!!--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్ .-9866252002--8886991785

ఉదయమే 


లేవడం ...


ఎంతముఖ్యమో 


రాత్రివేళ ...


త్వరగా నిద్రపోవడం ,


అంతేముఖ్యం ..!
కాలకృత్యాలు -


ఎంతముఖ్యమో ,


కనీస వ్యాయామం ,


అంతే ముఖ్యం!
నిన్న చేసిన పనులు 


 ఎంతముఖ్యమో ...


రేపటికోసం వాటి 


వివరాలు ...


డైరీలో నమోదు 


చేయడం --


అంతేముఖ్యం ...!
లేచిన వెంటనే ...


దంత ధావనం 


ఎంతముఖ్యమో ,


అల్పాహారం ....


తీసుకోవడం కూడా ,


అంతే ముఖ్యం ...!
రాత్రి ...


పడక ,


ఎంతముఖ్యమో ,


ఉదయం ...


నడక కూడా ,


అంతే ..ముఖ్యం !
చదువు ఎంత ముఖ్యమో,


సారాంశం రాయడమూ..


అంతే ముఖ్యం ...!
తల్లి దండ్రుల ప్రేమను 


పొందడం...


ఎంత ముఖ్యమో ,


వారిని ప్రేమించడమూ ,


అంతే ముఖ్యం ..!
బంధువుల /స్నేహితుల ,


పలకరింపు ఆశించడం ,


ఎంతముఖ్యమో ....


వారిని పలకరించడమూ ,


అంతేముఖ్యం ...!
ఇతరులనుండి ,


మర్యాద ఆశించడం 


ఎంతతముఖ్యమో ...


వారి పట్ల ....


మర్యాదగా వుండడమూ ,


అంతేముఖ్యం ...!
పుచ్చుకునే ఆలోచన ఉంటే ,


ఇచ్చే ..ఆలోచన కూడా ,


అంతేముఖ్యం ...!
హక్కుల కోసం ...


ఆరాటపడడం ,


ఎంతముఖ్యమో ...


బాద్యతలను గుర్తెరగడమూ ,


అంతే ..ముఖ్యం ..!
జీవితం అంటేనే --


ఇచ్చి -పుచ్చుకోడం కదా ..!!


 


 



కామెంట్‌లు