రోజులు -ముందుకి ,--బ్రతుకు - వెనక్కి .....: డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్

పండుగలు -
పబ్బాలూ ,
వస్తున్నాయ్ -
పోతున్నాయ్ !


సందడిలేకుండా ,
కావలసిన వాళ్లు 
కలవకుండా ,
సడీ -చప్పుడు 
లేకుండా ...
చల్లగా --
జారుకుంటున్నాయ్ !


వివాహాలు -
ఇతర వేడుకలూ ..
వెనక్కి జరిగి పోతున్నాయ్ !


విదేశాల్లో ...
ఇరుక్కున్నవాళ్ళు ,
నిశబ్ద జీవితానికి ,
సెట్ అయిపొయారు !


ఇంట్లో --
నాలుగు గోడలమధ్య ,
బందీలు అయినవాళ్లు ,
ఎప్పుడు తలుపులు 
తెరుచుకుంటాయోనని ,
ఎదురుచూస్తున్నారు !


మనిషి --
బలహీనత ఆసరాగా ,
మహమ్మారి ...
మంది మధ్యలో ఇంకా ,
స్వైరవిహారం --
చేస్తూనే ఉంది ....!!



కామెంట్‌లు