జయహో ...జామపండు ..: ----డా .కె .ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ.

పండ్లు అండీ పండ్లు ,
పలకమారిన పండ్లు ,
పక్వానికొచ్చిన పండ్లు ,
పదును దేలిన పండ్లు ,
పసందైన జామ పండ్లు !


పదిహేనేళ్ల క్రితం 
జనగాం నుండి తెచ్చి 
తాత నాటిన చెట్టు ,
నాకంటే ----
పదకొండేళ్లు పెద్దది ,
ఈ జామ చెట్టు ...!


నిత్యం కాయునట ..
ఎల్లవేళల లభ్యమట ,
ఈ తియ్యనైన జామపండ్లు !
నాకిష్టమైన పండ్లు ....
ఆరోగ్య ప్రద జామ పండ్లు !!
              -----------
ఫొటో లో---జామ పండ్లతో బేబీ..ఆన్షి.నల్లి.


కామెంట్‌లు