మొలక ..--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్ --9866252002---8886991785

విత్తనం మొలకెత్తడం 


మొలక పెద్దదయి 
మొక్కగా మారడం 
చూడాలనిపిస్తుంది .


మొక్క మ్రాను కట్టి 
చెట్టుగా ఎదగడం 
అదో ఆ శ్చర్య కర అంశం ,
చెట్టుమీదినుంచి 
వీచే చల్లని గాలి అంటే 
చెప్పలేనంత ఇష్టం ...!


చెట్టు చిగురిస్తే ....
పూలెన్నో విరబూ స్తే,
సుగంధాలు 
విరజిమ్ముతూంటే ,
పిందెలు కాసి ....
కాయలుగా మారితే ,
కాయలు పండ్లయితే ,
ఆనందం హద్దులు 
దాటుతుంది ....


రోజుకొక మొక్క -
నాటాలనిపిస్తుంది !
పచ్చని ప్రకృతిని -
మనసారా --
ఆస్వాదించాలనిపిస్తుంది !!



కామెంట్‌లు