సమీక్ష .....--డా .కె.ఎల్.వి.ప్రసాద్--హనంకొండ,వరంగల్.--0870-2432098.

ఎక్కడో తుఫాను ,
ఈదురుగాలులు 
రాష్ట్రమంతా 
ఎడతెరిపిలేని 
వర్షపుజల్లులు !


ఉహించని 
ఉపద్రవాలు ..
మనిషి అత్యాశకు 
ఆనవాళ్లు ...
మనిషిలోని 
స్వార్ధపు చేవ్రాళ్ళు ,
సహజత్వానికి 
గండికొట్టిన ...
వినాశకారుల 
విపరీతబుద్ధి !


వర్శాన్ని--
 స్వాగతించడం,
తప్పుకాదు ,
వర్షం కురవడం 
తప్పుకాదు ...!


అతి ఏదైనా 
ప్రమాదమే కదా,
అవసరానికి -
మించిన దానితో ,
ఎప్పుడూ అనర్ధమే!


క్షణం విశ్రమించని
వర్షాలు.....
కుంటలను నింపి
పొంగి పొర్లుతాయ్,


పంటలను --
పాడుచెస్తాయ్..


రైతన్నకు ...
కన్నీళ్లు కూడా 
మిగలకుండా ,
చేస్తాయ్ ....!


పల్లపు ప్రదేశాలు 
నీటి దుప్పటిని ,
కప్పుకుంటాయ్ ..


ఆహ్వనం లేకున్న 
గృహప్రవేశాలు 
చేస్తాయ్ .....


వాగులు -వంకలు 
పొంగి ...
వరదలై --
చుట్టుముడతాయ్ ,
జనజీవనాన్ని ...
స్తంబింప జేస్తాయ్ !


ఋతువులు 
గతితప్పితే ...
ప్రకృతి కి --
ప్రమాదం వాటిల్లితే ,
మనిషి మనుగడకు ,
ముప్పుతప్పదు ..!
సమస్యను --
సమీక్షించుకోక తప్పదు !!


కామెంట్‌లు