మనిషిలో ... మనుష్యులు ...: ----డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ .

మనిషి -మనిషికి 
ఒక స్వరం 
మాట్లడే విధానం 
ప్రత్యేకం ...


 మాటను బట్టి 
మనిషి ని 
గుర్తుపట్టవచ్చు 


అలా ---
మనిషి ..మనిషిది 
ఒకగొంతు 


ప్రతి మనిషి 
మాటతీరు 
అతనికి నిషాని !


మరి ...
ఒకేవ్యక్తి ....
భిన్నస్వరాలు 
పలికించగలిగితే ,


ధ్వనులు ....
వినిపించగల్గితే ,


అనుకరించ గల్గితే ,
అదొక గొప్పకళ !


ఆ ..కళనే ..
మిమిక్రీ అంటారు 


లేదంటే ,
ధ్వన్యనుకరణ 
అంటారు ...


ఈ మాటవింటే ,
నేరెళ్ల వేణుమాదవ్ 
గారు ...
గుర్తుకొస్తారు ...!!,


కామెంట్‌లు