శుభోదయం ..: -డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ.

రోజుకో -
దినపత్రిక ,
వస్తుంది మాకు ,
తాతయ్య బల్లపై -
తిష్టవేస్తుందిఅది !


చదవటం రాని 
నేనెమో ...
అటు -ఇటు 
కాసేపు ఆశగా తిప్పి 
ఆణిముత్యాల్లాంటి 
అక్షరాలను చూచి 
బొమ్మలతోనే 
సరిపెట్టుకుంటాను !


నటులను --
నాయకులను ,
గుర్తుపడతాను !


"చిన్నతనంనుండే 
పత్రికలు చదవడం 
జ్ఞాన సంపదను -
పెంచుకోవడం "
అంటారు మా తాత !


అందుకే ---
ప్రతిదినం .....
పత్రికా పఠనంతోనే 
మొదలవుతుంది -
నా ..శుభోదయం ..!!
------------------------------
ఫోటోలో--బేబి ఆన్షి.నల్లి.


కామెంట్‌లు