దిద్దడానికి ..గుడ్ బై ..: --డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,: -హనంకొండ .: ఫొటో : బేబి ఆన్షి.నల్లి

పలక - బలపం 
తాతవాళ్ళు 
వాడారు ....


వాటిమీద --అక్షరాలు 
దిద్దారు ...
అంకెలు నేర్చుకున్నారు 
బొమ్మల సాధన 
బ్రహ్మాండం గా 
చేశారు .....
విద్యార్జనలో 
విజయం సాధించారు !


పుస్తకం -పెన్సిలు 
అమ్మవాళ్ళు 
వాడారు ....


దిద్దడానికి బ దులు
చూచివ్రాత నేర్చారు ,
రాయడం -చదవడం లో ,
పురోగతి సాధించారు!


పలక - బలపం 
రోజులు పోయాయి 
పుస్తకం -పెన్సిలు 
స్థిరపడ్డాయి ....!
అవే నాకోసం 
సిద్దం చేయబడ్డాయి ..!!



కామెంట్‌లు