ఆ ..రోజుకోసం ...:డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ .--ఫొటో....ఆన్షి.నల్లి

చాక్ లెట్ 
అంటానా ...
వద్దు ...పళ్లు 
పుచ్చిపోతాయ్ 
అంటారు 'తాత '!


ఐస్క్రీమ్ ....
అంటానా .......
వద్దులే -జలుబు 
వస్తుంది .....
అంటుంది 'అమ్మ '!


అమ్మమ్మని ...
పుట్నాలు -
పెట్టమంటానా ,
వద్దునాన్నా ....
ఆకలి తగ్గిపొతుంది 
అంటుంది .....!


అడిగింది ,
ఇవ్వకుండా --
ఆపిల్ పండు తిను ,
బత్తాయి రసం తాగు ,
అంటూ ....
వెంటపడతారు 
ఈ ..పెద్దవాళ్ళు !


పిల్లలిని -పెద్దవాళ్లు ,
పెద్దవాళ్ళని -పిల్లలు ,
అర్థం చేసుకునే రోజు ,
ఎప్పుడు వస్తుందో ...!!



కామెంట్‌లు