నగరంలో వాన --డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ *వరంగల్ --9866252002--8886991785

బీళ్లు వారిన 
పంటపొలాల్లో ,
రైతన్న ...
నాలుగు చినుకులు పడితే,
నాట్లు మొదలెడదామని ,
ఆకాశం వంక 
కళ్లు కాయలుకాచేలా ,
ఎదురు చూస్తుంటాడు ,
వర్షం కురిస్తే ..అది ,
అమృతం కురిసినంత గా ..
ఆనంద పడిపోతుంటాడు !


కబ్జా కట్టడాలతో ..
నగరాలు ...
అక్కడ ..ఇక్కడ అన్న ,
తేడా లేకుండా ..
బహుళ అంతస్థుల ..
భవనాలతో ...
ఇరుకు సంతలైపోతాయి !


నగరంలో ..
వర్షం కురిసిందంటే ...
మూసుకుపోయిన ..
మురుగు కాలువలు ,
ఒక వెర్రి చూపు చూసి ,
తల దించేసుకుంటాయ్ ,
మార్గం దొరకని జలవాహిని ,
రోడ్లమీద 
నాదియై ప్రవహిస్తుంది ,
పల్లం ప్రదేశాలకు జారీ 
గృహ ప్రవేశాలు కూడా 
చేస్తుంది ...!
జనజీవనం అస్తవ్యస్తమై ,
నగరం లో వాన అంటే ..
సమస్త జనావళికి ,
వెన్నులో వణుకు పుడుతుంది !!


     


(భాగ్యనగరం లో వానల నేపథ్యం )


కామెంట్‌లు